శారదా పీఠాధిపతి పుట్టినరోజు వేడుకలకు మంత్రులు

ABN , First Publish Date - 2021-11-09T08:09:38+05:30 IST

శారదా పీఠాధిపతి పుట్టినరోజు వేడుకలకు మంత్రులు

శారదా పీఠాధిపతి పుట్టినరోజు వేడుకలకు మంత్రులు

విశాఖపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు వేడుకలకు సోమవారం రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌, పలువురు ఎమ్మెల్యేలు శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T08:09:38+05:30 IST