బైక్ అదుపు తప్పడంతో లారీ చక్రాల కింద పడిపోయిన దంపతులు

ABN , First Publish Date - 2021-12-30T19:12:15+05:30 IST

తణుకు జాతీయ రహదారిపై డీమార్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో పక్కనే

బైక్ అదుపు తప్పడంతో లారీ చక్రాల కింద పడిపోయిన దంపతులు

ఏలూరు : తణుకు జాతీయ రహదారిపై డీమార్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో పక్కనే వెళుతున్న లారీ వెనుక చక్రాల కింద దంపతులు పడిపోయారు. దీంతో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. తణుకు పట్టణ సీఐ ఆంజనేయులు వెంటనే స్పందించి కొన ఊపిరితో ఉన్న భర్తను తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Updated Date - 2021-12-30T19:12:15+05:30 IST