‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలో మహాధర్నా’

ABN , First Publish Date - 2021-07-12T21:46:36+05:30 IST

‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలో మహాధర్నా’

‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలో మహాధర్నా’

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేపట్టాల్సిన ఉద్యమంపై కార్యాచరణ రూపొందించినట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. సోమవారం ఈ విషయమై కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌ దగ్గర మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని పార్టీల మద్దతు కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-12T21:46:36+05:30 IST