విశాఖ: బ్లాక్ మార్కెట్‌లో బెవాసిజుమాబ్ ఇంజక్షన్లు

ABN , First Publish Date - 2021-05-18T21:41:16+05:30 IST

కోవిడ్ రోగులకు అవసరమైన ఇంజెక్షన్లను వేల రూపాయలకు అమ్ముతూ దోచుకుంటున్నారు.

విశాఖ: బ్లాక్ మార్కెట్‌లో బెవాసిజుమాబ్ ఇంజక్షన్లు

విశాఖ: నగరంలో కోవిడ్ రోగులకు అవసరమైన ఇంజెక్షన్లను వేల రూపాయలకు అమ్ముతూ దోచుకుంటున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీతంపేట కూడలివద్ద వర్ధమాన్ హెల్త్ స్పెషలిస్టు ప్రైవేటు లిమిటెడ్‌లో నిర్వహించిన సోదాల్లో ఇంజక్షన్ల అక్రమ నిల్వాలను గుర్తించారు.


రూ. 39వేలు విలువ చేసే బెవాసిజుమాబ్ ఇంజక్షన్‌ను రూ. 75వేలకు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకిదిగారు. రోగి బంధువులుగా నటిస్తూ ఈ దందాను గుర్తించారు. రూ. లక్ష 50వేలు చెల్లించి ఇద్దరు నుంచి రెండు ఇంజక్షన్లు తీసుకుంటుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-05-18T21:41:16+05:30 IST