శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారంలో bejawada Kanakadurgamma

ABN , First Publish Date - 2021-10-14T13:08:39+05:30 IST

దసరా మహోత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ 8వ రోజు (నేడు) గురువారం శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారం భక్తులకు దర్శనమిస్తుంది.రాక్షసులను సంహరించి

శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారంలో bejawada Kanakadurgamma

విజయవాడ: దసరా మహోత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ 8వ రోజు (నేడు) గురువారం శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారం భక్తులకు దర్శనమిస్తుంది.రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుందని,సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది.

Updated Date - 2021-10-14T13:08:39+05:30 IST