ఈరోజు అర్ధరాత్రి వరకూ బార్లు

ABN , First Publish Date - 2021-12-31T08:06:37+05:30 IST

ఈరోజు అర్ధరాత్రి వరకూ బార్లు

ఈరోజు అర్ధరాత్రి వరకూ బార్లు

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): డిసెంబరు 31న అర్ధరాత్రి వరకూ బార్లకు అనుమతివ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల్లో కూడా ఉదయం 11గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు ఎక్సైజ్‌ శాఖ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బార్ల పని వేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండగా, శుక్రవారం ఒక్కరోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మద్యం దుకాణాలను రాత్రి 9 గంటలకే మూయాల్సి ఉండగా... మరో గంట అదనంగా పెంచారు. శుక్రవారం అమ్మకాలు విపరీతంగా ఉంటాయని, తద్వారా భారీగా ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వం పని వేళలు పెంచేసింది. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, డిసెంబరు 31న మరింత పెరగనున్నాయి.

Updated Date - 2021-12-31T08:06:37+05:30 IST