రాజమండ్రి: భారీ స్కాంకు తెరలేపిన బ్యాంకు ఉద్యోగి

ABN , First Publish Date - 2021-02-01T16:44:14+05:30 IST

రాజమండ్రి: సఖినేటిపల్లి మండలంలో ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి భారీ స్కాంకు తెరలేపారు.

రాజమండ్రి: భారీ స్కాంకు తెరలేపిన బ్యాంకు ఉద్యోగి

రాజమండ్రి: సఖినేటిపల్లి మండలంలో ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి భారీ స్కాంకు తెరలేపారు. అతనికి మరో ఉద్యోగి సహకరించారు. గత కొంతకాలంగా తక్కువ బంగారానికి ఎక్కువ రుణం, ఒకే బంగారాన్ని పలు దఫాలుగా చూపిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఆ ఉద్యోగికి సంబంధం లేకపోయినా ఇజ్రాయెల్‌లో ఉన్న వారిని తన బంధువులుగా చూపించి అధిక మొత్తంలో లోన్స్ తీసుకోవడం వంటి మోసాలకు పాలడ్డారు. సుమారు రూ.6.80 కోట్లలో భారీ మోసం జరిగినట్లు తెలియవచ్చింది. తరచూ ఓకే వ్యక్తుల పేర్లతో గోల్డ్ లోన్ పెట్టడంపై అనుమానంతో హైదరాబాద్ ఎస్‌బీఐకు చెందిన అధికారులు కూఫీ లాగారు. ఎస్‌బీఐ జీఎం ఆదేశాల మేరకు ఆ ఉద్యోగులు ఇద్దరిని విధులు నుంచి తొలగించి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.


 ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనట్లుగా తెలియవచ్చింది.

Updated Date - 2021-02-01T16:44:14+05:30 IST