సీఎం జగన్‌కు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తాం: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-12-07T19:55:25+05:30 IST

ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని బండి శ్రీనివాసరావు అన్నారు.

సీఎం జగన్‌కు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తాం: బండి శ్రీనివాసరావు

అమరావతి: ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించడంలేదని నమ్ముతున్నామని చెప్పారు. పీఆర్సీ ప్రకటిస్తే ఉద్యమాన్ని విరమించి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తామని చెప్పారు. తామంతా ముఖ్యమంత్రి బిడ్డలమని, కోపం వస్తే అలగడం సహజమని బండి శ్రీనివాసరావు అన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అందులో భాగమేనన్నారు. ప్రభుత్వం మొండిగా ఉండేటట్లు అయితే తిరుపతిలో పీఆర్సీ ఇస్తామని చెప్పరని శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2021-12-07T19:55:25+05:30 IST