జగన్ అవినీతిలో కూరుకుపోయారు: బండారు సత్యనారాయణ

ABN , First Publish Date - 2021-05-08T21:56:24+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కదిద్దమని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తే.. సీఎం జగన్ కేసులు పెడతారా అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ అవినీతిలో కూరుకుపోయారు: బండారు  సత్యనారాయణ

విశాఖ: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కదిద్దమని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తే.. సీఎం జగన్ కేసులు పెడతారా అని మాజీ మంత్రి బండారు  సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ చేతకాని తనాన్ని పక్కతోవ పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని జగన్ ఆహాంకారం, అవినీతిలో  కూరుకుపోయారని బండారు సత్యనారాయణ చెప్పారు. జగన్ డబ్బు సంపాదనే లక్ష్యంగానే  పనిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవంటే కక్షసాధింపు, వేధింపుల కోసమే అన్నట్లుగా జగన్ నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జ్జానపురానికి 140 శవాలు వస్తే,  7 గురు మృతి చెందినట్లు చూపించారటే, వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడుతోందని బండారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-05-08T21:56:24+05:30 IST