చంద్రబాబుపై పేర్నినాని వ్యాఖ్యలను ఖండించిన బండారు
ABN , First Publish Date - 2021-11-27T00:38:54+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్నినాని వ్యాఖ్యలను మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు.

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్నినాని వ్యాఖ్యలను మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే పేర్నినాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేయడం లేదనే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులకు బూతులు, అనుచిత వ్యాఖ్యలు తప్ప ఏమీరాదన్నారు. మిమ్మల్ని పిచ్చికుక్కలనాలా? గాడిదాలనాలా? అని ప్రశ్నించారు. తమిళనాడులో వరదలు వస్తే సీఎం స్టాలిన్ ఇంటింటికి వెళ్తున్నారని, సీఎం జగన్‌కి ఏమైంది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేరా? అని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడతారనే సీఎం బయటకు రావడం లేదని బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవాచేశారు.