టీడీపీ నేతల ముందస్తు బెయిల్‌పై హైడ్రామా

ABN , First Publish Date - 2021-09-04T02:38:03+05:30 IST

టీడీపీ నేతల ముందస్తు బెయిల్ విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. 14 మంది టీడీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

టీడీపీ నేతల ముందస్తు బెయిల్‌పై హైడ్రామా

అమరావతి: టీడీపీ నేతల ముందస్తు బెయిల్ విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. 14 మంది టీడీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోలేదు. ముందస్తు బెయిల్ పత్రాలు తీసుకొని ఉదయం నుంచి జి.కొండూరు పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతల పడిగాపులు కాస్తున్నారు. రాత్రి అవుతున్న జి.కొండూరు ఎస్‌ఐ, మైలవరం సిఐలు స్టేషన్‌కు రాలేదు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-04T02:38:03+05:30 IST