టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2021-06-22T14:50:26+05:30 IST

బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆదోని సబ్ జైలు నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి విడుదలయ్యారు. ఆయనతో పాటు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు

కర్నూలు : బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆదోని సబ్ జైలు నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు అయింది. కాగా.. కొద్ది రోజుల క్రితం బీసీ జనార్ధన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న... ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులు ముగ్గురిని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. జనార్థన్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. వారిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి ఘటనలో జనార్ధన్‌రెడ్డితో పాటు.. మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనార్ధన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అలాగే ఐపీసీ 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్లతోపాటు... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు. 


Updated Date - 2021-06-22T14:50:26+05:30 IST