‘టీటీడీ-శిలువ’ వివాదంలో తెలంగాణవాసికి బెయిల్‌

ABN , First Publish Date - 2021-01-13T08:09:56+05:30 IST

టీటీడీ విద్యుద్దీపాల అలంకరణల్లో శిలువ గుర్తులున్నాయంటూ వీడియోలు, ఫొటోలను తన ఫేస్‌బుక్‌ద్వారా వైరల్‌ చేసి అరెస్టయిన తెలంగాణ వాసి రాజశేఖర్‌శర్మకు మంగళవారం తిరుపతి కోర్టు బెయిలు మంజూరు చేసింది.

‘టీటీడీ-శిలువ’ వివాదంలో తెలంగాణవాసికి బెయిల్‌

తిరుపతి, జనవరి 12: టీటీడీ విద్యుద్దీపాల అలంకరణల్లో శిలువ గుర్తులున్నాయంటూ వీడియోలు, ఫొటోలను తన ఫేస్‌బుక్‌ద్వారా వైరల్‌ చేసి అరెస్టయిన తెలంగాణ వాసి రాజశేఖర్‌శర్మకు మంగళవారం తిరుపతి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు హిందూ సం స్థల నాయకులు జైలువద్దకు చేరుకుని శర్మకు స్వాగతం పలికారు. వైకుం ఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ విద్యుద్దీపాలంకరణలో శిలువ గుర్తులు ఉన్నాయంటూ తెలంగాణలోని గద్వాల జిల్లాకు చెందిన శర్మ తన ‘తాళపత్ర నిధి’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో వీడియోలు, ఫొటోలు పోస్ట్‌ చేశారు. దీనిపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో తిరుమల పోలీసులు శర్మను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో ఆయనకు మంగళవారం బెయిల్‌ వచ్చింది. బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌, శివశక్తి, ఇతర హిందూ సంస్థల స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

Updated Date - 2021-01-13T08:09:56+05:30 IST