ప్రజలు నిలదీస్తారనే సీఎం బద్వేలు రాలేదు: బీజేపీ

ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలు నిలదీస్తారనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రచారానికి రాలేదని బీజేపీ

ప్రజలు నిలదీస్తారనే సీఎం బద్వేలు రాలేదు: బీజేపీ

పోరుమామిళ్ల, అక్టోబరు 25: బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలు నిలదీస్తారనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రచారానికి రాలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. సోమవారం బద్వేలులో ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ నియోజకవర్గంలో జగన్‌ సర్కారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అసలు 15 మంది మంత్రులను ఈ నియోజకవర్గంలో మోహరించి ఓటర్లను భయపెట్టాల్సిన అవసరం ఏ ముందని ప్రశ్నించారు. జగన్‌ నైతికంగా ఓటమిని అంగీకరిస్తున్నారన్నారు.


Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST