సీఎం సమక్షంలో శాసనసభను కౌరవసభగా మార్చారు: అయ్యన్న

ABN , First Publish Date - 2021-11-22T02:32:20+05:30 IST

సీఎం జగన్ సమక్షంలో శాసనసభను కౌరవసభగా మార్చారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో

సీఎం సమక్షంలో శాసనసభను కౌరవసభగా మార్చారు: అయ్యన్న

విశాఖ: సీఎం జగన్ సమక్షంలో శాసనసభను కౌరవసభగా మార్చారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో నీచాతి నీచంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అసెంబ్లీ చరిత్రలో ఇది మాయని మచ్చ అని తప్పుబట్టారు. రాజకీయాల్లో లేని వ్యక్తులను సభలో ప్రస్తావించడం విచారకరమన్నారు. అదే మీ భార్య, తల్లి, చెల్లిని అంటే మీరు బాధపడరా? అని అయ్యన్న ప్రశ్నించారు. మంత్రి కొడాలి నానికి చంద్రబాబును విమర్శించే స్థాయి ఉందా అని నిలదీశారు. ఇలాంటి చర్యలను మహిళా లోకమంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎంను ఇష్టమొచ్చినట్లు అంటుంటే డీజీపీ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బాబాయ్ హత్యపై హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్‌రెడ్డి.. దాన్ని ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని అయ్యన్నపాత్రుడు నిలదీశారు.

Updated Date - 2021-11-22T02:32:20+05:30 IST