13న హాజరుకండి!

ABN , First Publish Date - 2021-07-08T08:30:01+05:30 IST

కర్నూలు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్పకు జాతీయ బీసీ కమిషన్‌ బుధవారం నోటిసులు జారీ చేసింది. వివరాలివీ..

13న హాజరుకండి!

కర్నూలు కలెక్టర్‌, ఎస్పీకి బీసీ కమిషన్‌ నోటీసులు


కర్నూలు, జూలై 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్పకు జాతీయ బీసీ కమిషన్‌ బుధవారం నోటిసులు జారీ చేసింది. వివరాలివీ.. కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి సంబంధించి కర్నూలు 2వ వార్డు బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థి కె.గణేశ్‌ గతంలో జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన కమిషన్‌ ఎస్పీకి నోటీసుల జారీ చేసి 15 రోజుల్లో నివేదిక పంపించాలని ఆదేశించింది. దీంతో ఎస్పీ నివేదికను కమిషన్‌కు పంపించారు. ఈ నివేదికతో సంతృప్తి చెందని కమిషన్‌ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇరువురూ ఈ నెల 13న ఢిల్లీలోని కమిషన్‌ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

Updated Date - 2021-07-08T08:30:01+05:30 IST