టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడి.. విలువైన వస్తువుల ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-19T23:11:45+05:30 IST

టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు విలువైన వస్తువులను...

టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడి.. విలువైన వస్తువుల ధ్వంసం

విజయవాడ: టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు. దాడి సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి ఉన్నారు. తమ ఇంటిపై దాడి జరిగిందని పట్టాభికి భార్య, కూతురు ఫోన్‌ చేసి చెప్పారు. వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గంజాయి వ్యవహారంపై ఇవాళ టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ నేతలపై పట్టాభి విమర్శలు చేశారు. 


ఘటనాస్థలిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి సమయంలో ఇంట్లో కేవలం పట్టాభి ఐదేళ్ల కూతురు, పనిమనిషి, డ్రైవర్ ఉన్నారు. దాడి జరుగుతుండగా పట్టాభి కూతురిని బాత్‌రూమ్‌లో దాచిన పని మనిషి డ్రైవర్ మెడపై కత్తి పెట్టి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. Updated Date - 2021-10-19T23:11:45+05:30 IST