ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడి

ABN , First Publish Date - 2021-10-19T23:21:55+05:30 IST

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో...

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడి

అమరావతి: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో చంద్రబాబు హుటాహుటిన బయల్దేరారు. 
Updated Date - 2021-10-19T23:21:55+05:30 IST