టీడీపీ మద్దతుదారుడి ఇంటిపై వైసీపీ నేతల దాడి

ABN , First Publish Date - 2021-03-22T09:37:58+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశాడనే కారణంతో టీడీపీ మద్దతుదారుడి ఇంటిపై వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. కృష్ణాజిల్లా

టీడీపీ మద్దతుదారుడి ఇంటిపై వైసీపీ నేతల దాడి

మచిలీపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశాడనే కారణంతో టీడీపీ మద్దతుదారుడి ఇంటిపై  వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు.  కృష్ణాజిల్లా మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ 42వ డివిజన్‌ (బలరామునిపేట)లో ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి తరఫున చీలి సుమన్‌అనే వ్యక్తి ప్రచారం నిర్వహించగా వైసీపీ నాయకులు వద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్‌ చీలి రుచిత, ఆమె భర్త చక్రపాణి అనుచరులు ఆదివారం తెల్లవారుజామున సుమన్‌ ఇంటిపై రాళ్లతో దాడిచేయడమే కాక పరుషపదజాలంతో దూషించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకుని డీఎస్పీ రమేశ్‌ రెడ్డి, సీఐలకు పరిస్థితిని వివరించారు. 

Updated Date - 2021-03-22T09:37:58+05:30 IST