జగన్ రెండేళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-05-30T19:47:01+05:30 IST

‘జగన్‌ విధ్వంసం అనే చార్జ్‌షీట్‌’ విడుదల చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

జగన్ రెండేళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధం: అచ్చెన్నాయుడు

విశాఖ: జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రేండేళ్లు పూర్తయిందని, ఈ రెండేళ్లలో సీఎం చేసిన విధ్వంసంపై ‘జగన్‌ విధ్వంసం అనే చార్జ్‌షీట్‌’ విడుదల చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలో కెక్కారన్నారు. జగన్ రెండేళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధమన్నారు.


రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ డమ్మీలేనని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీ, ఏసీబీ, పీసీబీ...టాగ్ లైన్ సీఐడీ.. జేసీబీతో కూల్చడం, ప్రశ్నించిన వారిపై ఏసీబీ కేసులు పెట్టడం, కుదరక పోతే పీసీబీని రంగంలోకి దింపుతున్నారన్నారు. సీఎం జగన్ ఏది చెప్తే సీఐడీ అదే చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం పతనమైపోతోందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-05-30T19:47:01+05:30 IST