ఆసరా కాదు.. పచ్చి దగా: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-10-07T22:48:03+05:30 IST

ఆసరా కాదు.. పచ్చి దగా అని, కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్‌ రెడ్డి టోకరా పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఆసరా కాదు.. పచ్చి దగా: అచ్చెన్నాయుడు

అమరావతి: ఆసరా కాదు.. పచ్చి దగా అని, కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్‌ రెడ్డి టోకరా పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. మొదటి విడత 87 లక్షల మంది.. ఇప్పుడు 78.76 లక్షల మంది, ఎనిమిదిన్నర లక్షల మంది ఏమయ్యారు జగన్‌ రెడ్డీ? అని ప్రశ్నించారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే ఆసరా 78లక్షల మందికా?, సెప్టెంబరులో నొక్కాల్సిన ఆసరా మీట.. ఎందుకు ఆలస్యమైంది? అని ఆయన ప్రశ్నించారు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్నావ్‌... ఇప్పుడు ఒక విడతను పది విడతలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నీ సాక్షి లెక్క ప్రకారమే.. 2014 నాటికి రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు, టీడీపీ రూ.18,600 కోట్లు డ్వాక్రా రుణమాఫీ, పసుపు-కుంకుమ 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మలకు రూ.3వేల సహాయం ఏమైంది? అని ప్రశ్నించారు. టీడీపీ రుణాలివ్వలేదంటున్నావు.. ఇప్పుడు చెల్లిస్తున్న రూ.25,517 కోట్లు ఎవరిచ్చినవి? అని ప్రశ్నించారు. గతేడాది రూ.27,168 కోట్ల రుణాలు.. ఇప్పుడు రూ.25,517 కోట్లా?, గతేడాది రూ.6,792 కోట్లు మాఫీ అన్నావు.. ఇప్పుడు రూ. రూ.6,319 కోట్లు అంటున్నావన్నారు. 8.26 లక్షల మందిని తగ్గించి.. రూ.121 కోట్లు అధనంగా చెల్లింపులా?, సూట్ కేస్ కంపెనీ లెక్కల్లా.. సంక్షేమం లెక్కలు, డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము స్వాహా చేయడం ఉద్దరించడమా? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-07T22:48:03+05:30 IST