అశోక్‌ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-12-31T07:36:09+05:30 IST

అశోక్‌ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

అశోక్‌ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

అరెస్ట్ తో పాటు తదుపరి చర్యలు నిలిపివేత 

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ అశోక్‌గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులో అరె్‌స్టతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ గురువారం ఆదేశాలిచ్చారు. నెలిమర్ల మండలం రామతీర్థంబోడికొండపై కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తమ అధికార విధులకు ఆటంకం కలిగించారంటూ ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజుపై దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా 22న నెలిమర్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌ను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారన్నారు. 

Updated Date - 2021-12-31T07:36:09+05:30 IST