30 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-10T01:31:59+05:30 IST

జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు

30 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

పశ్చిమ గోదావరి: జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఉండ్రాజవరం మండలంలోని చివటం గ్రామం వద్ద వన భోజనాలు ముసుగులో భారీ పేకాట శిబిరం  జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసారు. 30 మంది పేకాటరాయుళ్లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 బైక్‌లు, ఒక కారు, 30 సెల్ ఫోన్లు, మూడు లక్షల 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-10T01:31:59+05:30 IST