‘ఉక్కు’ పోరాటానికి ఏపీపీటీడీ ఈయూ మద్దతు

ABN , First Publish Date - 2021-02-08T08:57:41+05:30 IST

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది.

‘ఉక్కు’ పోరాటానికి ఏపీపీటీడీ ఈయూ మద్దతు

విజయవాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. స్టీల్‌ప్లాంట్‌లో నష్టాల నివారణకు కేంద్రం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు కోరారు. లక్ష మందికిపైగా ఉద్యోగులు, కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ కర్మాగారాన్ని కాపాడుకోడానికి జరిగే ప్రతి పోరాటానికి ఏపీ పీటీడీ ఈయూ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే విశాఖ ఉక్కు ప్లాంట్‌ను కాపాడుకోగలమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-08T08:57:41+05:30 IST