తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-12-30T12:38:06+05:30 IST
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు జిల్లా/కలికిరి : జిల్లావ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108, 104 సర్వీసుల జిల్లా మేనేజరు ఆర్.చంద్రమౌళి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 102 వాహనాలకు డ్రైవర్లు అవసరమని పేర్కొన్నారు. 10 తరగతి ఉత్తీర్ణతతోపాటు బ్యాడ్జీ లేదా హెవీ (ట్రాన్స్‌పోర్టు) డ్రైవింగ్ లైసెన్సు కలిగి 45 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరిం చారు. సీటీసీ విధానంలో రూ.10వేల జీతం ఉంటుందని తెలియజేశా రు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 లోగా తిరుపతి మున్సిపల్ పార్క్ పక్కన వున్న 108, 104 సర్వీసుల కార్యాలయంలో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందజేయాలని కోరారు.