ఆక్వా సాగు, వ్యాపార లైసెన్స్‌కు దరఖాస్తు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-02-06T09:44:06+05:30 IST

రాష్ట్రంలో ఆక్వా సాగు, ఆక్వా సీడ్‌, ఫిష్‌ ఫీడ్‌ వ్యాపారులు లైసెన్సుల కోసం నాలుగు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

ఆక్వా సాగు, వ్యాపార లైసెన్స్‌కు దరఖాస్తు తప్పనిసరి

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆక్వా సాగు, ఆక్వా సీడ్‌, ఫిష్‌ ఫీడ్‌ వ్యాపారులు లైసెన్సుల కోసం నాలుగు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌, ఆక్వా సీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ చట్టాలు అమలులోకి వచ్చినందున నూతన చట్టాల ప్రకారం ప్రస్తుత సాగుదారులు, వ్యాపారులు లైసెన్సుల కోసం తగిన రికార్డులతో జిల్లా అథారిటీలకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2021-02-06T09:44:06+05:30 IST