న్షన్‌కు జాయింట్ ఖాతా తప్పనిసరి కాదు
ABN , First Publish Date - 2021-11-21T07:39:15+05:30 IST
జీవిత భాగస్వామి పెన్షన్ కోసం జాయింట్ బ్యాంకు ఖాతా తప్పనిసరికాదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. ...

న్యూఢిల్లీ, నవంబరు 20: జీవిత భాగస్వామి పెన్షన్ కోసం జాయింట్ బ్యాంకు ఖాతా తప్పనిసరికాదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగి తన నియంత్రణలోలేని కారణాలతో తన భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతా తెరవడం సాధ్యంకాదని కార్యాలయ అధిపతి భావిస్తే దీని అవసరాన్ని సడలించవచ్చని కేంద్ర సిబ్బంది, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కుటుంబ పెన్షన్ కోసం జీవిత భాగస్వామి (ఫ్యామిలీ పెన్షనర్) ప్రస్తుత జాయింట్ బ్యాంక్ ఖాతాను ఎంచుకున్నట్టయితే కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు పట్టుబట్టకూడదని కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ను పంపిణీ చేసే అన్ని బ్యాంకులకు సూచించినట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు.