ఖరగ్‌పూర్‌-విజయవాడ కారిడార్‌కు డీపీఆర్‌

ABN , First Publish Date - 2021-12-07T08:28:30+05:30 IST

ఖరగ్‌పూర్‌-విజయవాడ, విజయవాడ-నాగ్‌పూర్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వశాఖ ...

ఖరగ్‌పూర్‌-విజయవాడ కారిడార్‌కు డీపీఆర్‌


 ‘విజయవాడ-నాగ్‌పూర్‌’కు కూడా రూపొందిస్తున్న రైల్వే

న్యూఢిల్లీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఖరగ్‌పూర్‌-విజయవాడ, విజయవాడ-నాగ్‌పూర్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వశాఖ విరణాత్మక ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) రూపొందిస్తున్నట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. జాతీయ గనుల విధానం కింద డెడికేటెడ్‌ మినరల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మైనింగ్‌ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఈ కారిడార్లు వినియోగపడనున్నట్లు తెలిపారు. మినరల్‌ కారిడార్లకు అనుబంధంగా ఖనిజ రవాణా కోసం స్థానికంగా సమగ్రమైన రీతిలో నెట్‌వర్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా గూడ్సు రైళ్ల ద్వారా భారీగా సరకులు రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-12-07T08:28:30+05:30 IST