ఆర్జేయూకేటీ సీట్లకు 12,13న కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-12-07T08:25:46+05:30 IST

ఆర్జేయూకేటీల్లో ఎన్‌సీసీ, దివ్యాంగులు, స్పోర్ట్స్‌కోటా సీట్ల భర్తీకి ఈ నెల 12, 13తేదీల్లో కౌన్సెలింగ్‌ ..

ఆర్జేయూకేటీ సీట్లకు 12,13న కౌన్సెలింగ్‌

ఆర్జేయూకేటీల్లో ఎన్‌సీసీ, దివ్యాంగులు, స్పోర్ట్స్‌కోటా సీట్ల భర్తీకి ఈ నెల 12, 13తేదీల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. మిగతా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తిచేశామని నూజివీడు ఆర్జేయూకేటీ చాన్సలర్‌ కె.సి.రెడ్డి సోమవారం తెలిపారు. సీఏపీ, ఎన్‌సీసీ కోటాలో సీట్లకు 12వ తేదీన, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ కోటాలో సీట్ల భర్తీకి 13న నూజివీడు ఆర్జేయూకేటీ క్యాంప్‌సలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-12-07T08:25:46+05:30 IST