14 మంది గురుకుల విద్యార్థులకు వైరల్‌ ఫీవర్‌

ABN , First Publish Date - 2021-12-07T08:00:33+05:30 IST

కృష్ణాజిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల విద్యాలయం హాస్టల్‌ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ..

14 మంది గురుకుల విద్యార్థులకు వైరల్‌ ఫీవర్‌

 ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

 విద్యార్థులకు మంత్రి పేర్ని నాని పరామర్శ

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 6: కృష్ణాజిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల విద్యాలయం హాస్టల్‌ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్ధులకు మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి వైరల్‌ ఫీవర్‌గా వైద్యులు నిర్ధారించారు. చిలకలపూడి వరలక్ష్మీ పాలిటెక్నిక్‌ అద్దె భవనంలో గురుకుల విద్యాలయం, హాస్టల్‌ భవనాలను నిర్వహిస్తున్నారు. విద్యాలయం చుట్టూ నీరు నిల్వ ఉండటంతో దోమల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో నీరు, భోజనం సరిగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది విద్యార్థులను మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా కలెక్టర్‌ నివాస్‌ పరామర్శించారు. విద్యార్ధులకు వైరల్‌ ఫీవర్‌ సోకినట్టు కలెక్టర్‌కు.. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుహాసిని తెలిపారు. కాగా.. విధి నిర్వహణలో అలసత్వం చూపుతున్న తెలుగు, బయోలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని డీఈవో తాహెరా సుల్తానాను కలెక్టర్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-12-07T08:00:33+05:30 IST