కండక్టర్‌ కుటుంబానికి రూ.50లక్షలు: ఆర్టీసీ ఎండీ

ABN , First Publish Date - 2021-11-21T08:21:32+05:30 IST

: విధి నిర్వహణలో భాగంగా వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కండక్టర్‌ కుటుంబానికి ఆర్టీసీ రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది...

కండక్టర్‌ కుటుంబానికి   రూ.50లక్షలు: ఆర్టీసీ ఎండీ

ఒంటిమిట్ట నవంబరు 20: విధి నిర్వహణలో భాగంగా వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కండక్టర్‌ కుటుంబానికి ఆర్టీసీ రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామాన్ని సందర్శించారు. రాజంపేట సమీపంలోని రామాపురం వద్ద వరద ఉధృతిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కండక్టర్‌ అహోబిలం మృతదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారికి రూ.50లక్షలు పరిహారం అందజేసి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-11-21T08:21:32+05:30 IST