భువనేశ్వరి మాకు సోదరితో సమానం: బాలినేని

ABN , First Publish Date - 2021-11-21T08:09:24+05:30 IST

‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాకు సోదరితో సమానం. ఆమెను ఉద్దేశించి ఎవరైనా అనుచితంగా మాట్లాడి ఉంటే ఖండించే వాళ్లం. ..

భువనేశ్వరి మాకు సోదరితో సమానం: బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20: ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాకు సోదరితో సమానం. ఆమెను ఉద్దేశించి ఎవరైనా అనుచితంగా మాట్లాడి ఉంటే ఖండించే వాళ్లం. కానీ, అసెంబ్లీ సమావేశాల్లో అలాంటిదేమీ జరగలేదు. ఏదో జరిగినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజల్లో సానుభూతి కోసమే’’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు కుప్పంలో టీడీపీ ఓటమితో ఆందోళన లో ఉండి రకరకాలుగా ప్రవర్తించారని విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరును ప్రస్తావించారనడం అవాస్తవమన్నారు. ‘‘చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్‌రెడ్డి సోదరిని ఉద్దేశించి టీడీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడితే కనీసం ఖండించలేదు. చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని బాలినేని ఆరోపించారు. 

Updated Date - 2021-11-21T08:09:24+05:30 IST