బాలకృష్ణ అమాయక చక్రవర్తి: మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2021-11-21T08:08:28+05:30 IST

‘‘నందమూరి బాలకృష్ణ అమాయక చక్రవర్తి. చంద్రబాబు ఏం చెబితే అది నమ్మేస్తాడు. అందరి ఇళ్లల్లోనూ ఆడవాళ్లు ఉన్నారు..

బాలకృష్ణ అమాయక చక్రవర్తి: మంత్రి పేర్ని

మరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘నందమూరి బాలకృష్ణ అమాయక చక్రవర్తి. చంద్రబాబు ఏం చెబితే అది నమ్మేస్తాడు. అందరి ఇళ్లల్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. అలాంటిది మేమెందుకు తిడతాం. అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతోంటే దానిపై ఒక్క ప్రశ్నయినా వేశారా? అనవసర మాటలతో రాద్ధాంతం చేసింది చంద్రబాబు’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ‘‘చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలొడీ డ్రామాను సృష్టించారు. శాసనసభలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యుల, ఆయన శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొవాలి. మెలొడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను చంద్రబాబే తెచ్చారు. అసెంబ్లీ సమావేశాల చర్చ అందరి దగ్గరా ఉంది. ఒకసారి చెక్‌ చేసుకోవాలి. బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా అది నిజమని నమ్మారు. చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్‌  డ్రామా. నందమూరి కుటుంబం అది నమ్మి మోసపోద్దు’’ అని మంత్రి పేర్ని కోరారు. 

Updated Date - 2021-11-21T08:08:28+05:30 IST