ఐఎన్‌ఎస్ విశాఖపట్నం
ABN , First Publish Date - 2021-11-21T07:41:59+05:30 IST
ర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ యుద్ధనౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం జలప్రవేశం చేయించనున్నారు...

నేడు జలప్రవేశం చేయనున్న
జాతికి అంకితమివ్వనున్న
రక్షణ మంత్రి రాజ్‌నాథ్
నేడు జలప్రవేశం చేయనున్న
‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’
విశాఖపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ యుద్ధనౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం జలప్రవేశం చేయించనున్నారు. అనంతరం ఆయన దీనిని జాతికి అంకితమిస్తారు. ముంబైలోని మజగాన్ నౌకాదళ కేంద్రంలో రూపుదిద్దుకున్న ఈ యుద్ధనౌకకు 2015 ఏప్రిల్ 20న ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ అని పేరు పెట్టారు. గత నెల 29న నౌకాదళం చేతికి ఈ నౌక అందింది. ప్రాజెక్టు 15బీలో నిర్మిస్తున్న నాలుగు నౌకల్లో ఐఎన్‌ఎస్ విశాఖపట్నం మొదటిది. శత్రుదేశాల క్షిపణులను రహస్యంగా మట్టుబెట్టగలిగే ఈ నౌక పొడవు 163 మీటర్లు. వెడల్పు 17 మీటర్లు. బరువు 7,400 టన్నులు. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాలిలోకి ఆయుధాలను ప్రయోగించే సామ ర్థ్యం ఈ నౌక సొంతం. నిఘా రాడార్ ఇందులో మరో ప్రత్యేకత. సబ్‌మెరైన్లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే రాకెట్ లాంచర్లు, టార్పెడో లాంచర్లు, మల్టీ రోల్ హెలికాప్టర్లు దీనిలో ఏర్పాటు చేశారు. అణు, జీవ రసాయన యుద్ధ వాతావరణాల్లోను ఇది పనిచేయగలదు.