అరాచకాలు చేసే అలవాటు మాకు లేదు: వైవీ

ABN , First Publish Date - 2021-10-31T10:12:57+05:30 IST

అరాచకాలు చేసే అలవాటు మాకు లేదు: వైవీ

అరాచకాలు చేసే అలవాటు మాకు లేదు: వైవీ

తిరుపతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ కార్యాలయంపై నాలుగు రాళ్లు ఎవరు వేశారో కూడా తెలియదు. అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ చంద్రబాబు ఢిల్లీ వరకు వెళ్లి రంకెలు వేశాడు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేసే సంప్రదాయం మాకు గానీ, ప్రభుత్వ అధికారులకు గానీ లేదు’’ అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి పాలనతో సీఎంగా జగన్మోహన్‌రెడ్డిని పక్కన పెడితే ఆయన ఇష్టమొచ్చినట్టు ఆడొచ్చని అనుకొంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరైన జగన్‌... శాశ్వతంగా సీఎంగా ఉంటారనే ఈర్ష్య, ద్వేషాలతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైవీ మండిపడ్డారు. 

Updated Date - 2021-10-31T10:12:57+05:30 IST