1, 2, 3, 4.... 90!

ABN , First Publish Date - 2021-10-31T08:21:06+05:30 IST

1, 2, 3, 4.... 90!

1, 2, 3, 4.... 90!

1, 2, 3, 4.... ఇలా లెక్కేస్తే 90 వరకూ ఆపకుండా చదవాల్సిందే. ఎందుకంటే ఈ లారీకున్న చక్రాలు మొత్తం 90. భారీ యంత్రాలను తరలిస్తున్న ఇటువంటి మూడు లారీలు మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. పేపర్‌ తయారు చేసే భారీ యంత్రాన్ని శ్రీశైలం నుంచి భద్రాచలం తరలిస్తున్నారు. అయితే, వడ్డేశ్వరం వద్ద జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరా ఈ లారీలు వెళ్లడానికి అడ్డుగా ఉంది. దాంతో గత 15 రోజులుగా ఇవి ఇక్కడే నిలిచిపోయాయి. ఆ సీసీ కెమెరా కోసం చేసిన ఏర్పాట్లను పక్కకు తప్పించేందుకు అధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు లారీల సిబ్బంది తెలిపారు. - విజయవాడ



Updated Date - 2021-10-31T08:21:06+05:30 IST