ఒత్తిడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి
ABN , First Publish Date - 2021-10-29T10:00:11+05:30 IST
ఒత్తిడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి
పిటిషనర్లకు హైకోర్టు సూచన
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఎయిడ్ కళాశాలల విలీనం విషయంలో అధికారులు ఒత్తిడిచేస్తే పోలీసులకు ఫిర్యా దు చేయాలని పిటిషనర్లకు సూచించింది.