మా పిల్లాడి ప్రాణాలు నిలబెట్టరూ!
ABN , First Publish Date - 2021-10-29T09:54:47+05:30 IST
మా పిల్లాడి ప్రాణాలు నిలబెట్టరూ!
పేద తల్లిదండ్రుల ఆవేదన
నరసరావుపేట టౌన్, అక్టోబరు 28: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో నివసిస్తున్న నీలం నాగుల్ మీరా, నాగపద్మలకు ఇద్దరు కవల పిల్లలు. నాగుల్ మీరా వాచ్‌మేన్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య నాగపద్మ ఇళ్లలో పనిచేస్తోంది. కవలలకు చంద్రశేఖర్, చందురాజశేఖర్ అనే పేర్లు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇంతలోనే చంద్రశేఖర్‌కు కిడ్నీ సమస్య వచ్చింది. రెండుసార్లు శస్త్రచికిత్సలు చేసి ఒక కిడ్నీ తొలగించారు. మరో కిడ్నీకి కూడా ఇన్‌ఫెక్షన్ సోకడంతో యూరినల్స్ రావడం కష్టంగా ఉంది. కిడ్నీకి డయాలసిస్ చేస్తున్నారు. యూరిన్‌లో రక్తం వస్తుండడంతో తక్షణమే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఇప్పటికే జరిగిన రెండు సర్జరీలకు వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మేసి వైద్యం చేయించారు. మరో ఆపరేషన్ చేసేందుకు వారి వద్ద డబ్బులు లేవు. గుంటూరు వేదాంతా హాస్పటల్‌లో శస్త్రచికిత్సకు రూ.60 వేలు అవుతుందన్నారు. చంద్రశేఖర్ బాధను చూడలేక, వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఆ తల్లిదండ్రుల మనోవేదనకు గురవుతున్నారు. ఈ శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ కిందకు రాదని వైద్యులు చెప్పారని, దాతలు తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు 9347169773, 8374866707 నంబర్లలో సంప్రదించి, సాయంచేయాలని కోరుతున్నారు.