టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-29T09:42:34+05:30 IST

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

డోన్‌ టీడీపీ ఇన్‌చార్జిగా మన్నె సుబ్బారెడ్డి


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మన్నె సుబ్బారెడ్డి నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇటీవల టీడీపీలో చేరిన జీవీ రెడ్డి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన మహ్మద్‌ ఫతావుల్లాను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన వాసంశెట్టి సత్యనారాయణను బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా వాసం మునెయ్యను నియమించారు. 


Updated Date - 2021-10-29T09:42:34+05:30 IST