సినిమా టికెట్లు, స్వరూపానంద కోసమా కేబినెట్‌: శ్రావణ్‌

ABN , First Publish Date - 2021-10-29T09:40:59+05:30 IST

సినిమా టికెట్లు, స్వరూపానంద కోసమా కేబినెట్‌: శ్రావణ్‌

సినిమా టికెట్లు, స్వరూపానంద కోసమా కేబినెట్‌: శ్రావణ్‌

సినిమా టికెట్లు... స్వరూపానంద స్వామికి భూమి కేటాయింపు కోసమే రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగినట్లు కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రజా సమస్యలేవీ ఇందులో చర్చకు రాలేదని, ప్రజలపై వైసీపీ పార్టీకి ఉన్న శ్రద్ధ ఏమిటో దీనిని బట్టే తెలుస్తోందని ఆ పార్టీ విమర్శించింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేబినెట్‌లో చర్చకు రాకపోవడాన్ని తప్పు పట్టారు. ఎయిడెడ్‌ మూసివేతపై చర్చించడానికి మంత్రిమండలికి సమయం దొరకలేదంటూ విమర్శించారు. ఉద్యోగ క్యాలెండర్‌పై చర్చింకుండా స్వరూపానందకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం ఆఘమేఘాలపై నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టారు.  


Updated Date - 2021-10-29T09:40:59+05:30 IST