బద్వేలులో రేపే పోలింగ్
ABN , First Publish Date - 2021-10-29T09:33:01+05:30 IST
బద్వేలులో రేపే పోలింగ్
కడప, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. బద్వేలులో 2,12,730మంది ఓటర్ల కోసం ఏడు మండలాల్లో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1124మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.