సొరంగం కూలడానికి నాణ్యత లోపం కారణం కాదు: ఈఈ
ABN , First Publish Date - 2021-10-29T09:32:25+05:30 IST
సొరంగం కూలడానికి నాణ్యత లోపం కారణం కాదు: ఈఈ

పోలవరం, అక్టోబరు 28: పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఉన్న సొరంగం కూలడానికి లైనింగ్ పనుల్లో నాణ్యత లోపం కారణం కాదని ప్రాజెక్టు అనుబంధ పనుల ఈఈ కె.బాలకృష్ణ తెలిపారు. సొరంగం కూలినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని, సొరంగం పైభాగాన ఎటువంటి లైనింగ్ చేపట్టలేదని, కింద భాగంలో మాత్రమే కాంక్రీట్ లైనింగ్ జరిగిందని, వీక్ జోన్ ప్రాంతాల్లో మట్టి, రాళ్లు జారకుండా ఏర్పాటు చేసింది ఐరన్ బారికేడింగ్ మాత్రమేనని, సొరంగం పైభాగం కూలిన ప్రాంతంలో మట్టి కట్ట ఉండడం వల్ల లైనింగ్‌కు నష్టం జరగలేదన్నారు.