టీడీపీకి పేరొస్తుందనే ఇళ్లు ఇవ్వడం లేదు

ABN , First Publish Date - 2021-10-29T09:25:45+05:30 IST

టీడీపీకి పేరొస్తుందనే ఇళ్లు ఇవ్వడం లేదు

టీడీపీకి పేరొస్తుందనే ఇళ్లు ఇవ్వడం లేదు

పొగాకు బోర్డు రాష్ట్ర  చైర్మన్‌ రఘునాథబాబు


ఏలూరు టూ టౌన్‌, అక్టోబరు 28 : కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సద్వినియోగం చేసుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇవ్వకుండా ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తున్నారని పొగాకు బోర్డు రాష్ట్ర చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణకు కేంద్రం రైతులకు 60 శాతం నిధులను ఇస్తుంటే.. 40 శాతం మ్యాచింగ్‌ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్రం నిధులు కేటాయించలేక కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను తీసుకోలేకపోతోందన్నారు. దీంతో వ్యవసాయం కుంటుపడి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు.  కేంద్ర నిధులతో నిర్మించిన టిడ్కో ఇళ్లు టీడీపీ హయాంలో 90 శాతం పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. వాటిని పేదలకు ఇస్తే తెలుగుదేశానికి ఎక్కడ పేరు వస్తుందోనని జగన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. 

Updated Date - 2021-10-29T09:25:45+05:30 IST