జగన్‌కు శ్రేయోభిలాషిని!

ABN , First Publish Date - 2021-10-29T08:22:44+05:30 IST

జగన్‌కు శ్రేయోభిలాషిని!

జగన్‌కు శ్రేయోభిలాషిని!

చూసి చాలా రోజులైంది.. అందుకే వచ్చాను

విజయవాడ, అమరావతికి రావడం చాలా సంతోషంగా ఉంది: నాగార్జున

ప్రత్యేక విమానంలో గన్నవరం రాక

తాడేపల్లి నివాసంలో సీఎంతో కలిసి భోజనం


అమరావతి/గన్నవరం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తాను శ్రేయోభిలాషినని ప్రముఖ సినీనటుడు నాగార్జున అక్కినేని చెప్పారు. ఆయన్ను చూసి చాలా రోజులైందని.. అందుకే చూసేందుకు వచ్చానని.. అంతకుమించి ఏమీ లేదని తెలిపారు. జగన్‌తో కలిసి లంచ్‌ చేశానన్నారు. ముఖ్యమంత్రితో నాగార్జున గురువారమిక్కడ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఆర్డినెన్స్‌ జారీకి సీఎం ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే నిర్మాత నిరంజన్‌రెడ్డి, దర్శకుడు ప్రీతమ్‌రెడ్డితో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగిన నాగార్జున.. రోడ్డుమార్గాన నేరుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. జగన్‌ దంపతులతో కలిసి భోజనం చేశారు. సమావేశం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు చర్చకు రాలేదని తెలిసింది. వ్యక్తిగత అంశాలే ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సీఎం నివాసం నుంచి తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నాగార్జున మీడియాతో మాట్లాడారు. విజయవాడ, అమరావతికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

Updated Date - 2021-10-29T08:22:44+05:30 IST