‘ధూళిపాళ్ల’ ట్రస్టు స్వాధీనానికి నోటీసులు

ABN , First Publish Date - 2021-10-28T08:43:24+05:30 IST

‘ధూళిపాళ్ల’ ట్రస్టు స్వాధీనానికి నోటీసులు

‘ధూళిపాళ్ల’ ట్రస్టు స్వాధీనానికి నోటీసులు

చేబ్రోలు, అక్టోబరు 27: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌(డీవీసీ) ట్రస్టును స్వాధీనం చేసుకునేందుకు ఏపీ చారిటబుల్‌ అండ్‌ హిందూ రెలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అండ్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌ 1987 యాక్టు నం.30 ప్రకారం దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ నోటీసులు జారీ చేశారు. ట్రస్టు వర్గాల కఽథనం ప్రకారం.. 2నెలల క్రితం దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఇదే విధమైన నోటీసులు జారీ చేయగా, ట్రస్టు నిర్వాహకుడైన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ న్యాయవాదుల ద్వారా సమాధానం పంపారు. తమ సంస్థలో ఎటువంటి అక్రమ లావాదేవీలు జరగలేదని, ట్రస్టు నియమ నిబంధనలను తాము ఏనాడూ ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి స్వయంగా కమిషనరే ట్రస్టు స్వాధీనానికి నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

Updated Date - 2021-10-28T08:43:24+05:30 IST