ఐటీ కమిషనర్‌గా దయాసాగర్ బాధ్యతలు
ABN , First Publish Date - 2021-10-28T08:42:26+05:30 IST
ఐటీ కమిషనర్‌గా దయాసాగర్ బాధ్యతలు

విజయవాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్ విజయవాడ ఆదాయపు పన్ను కమిషనర్ (టీడీఎ్‌స)గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి దయాసాగర్ గతంలో ముంబై, హైదరాబాద్‌ల్లో ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేశారు. విజయవాడ ఇన్‌కం ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వినోద్ కన్నన్, విశాఖపట్నం జాయింట్ కమిషనర్ శంకర్, విశాఖ డిప్యూటీ కమిషనర్ చింతపల్లి మెహర్‌చాంద్, విజయవాడ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ (హెడ్‌క్వార్టర్స్) దుర్గాభవానీ.. కొత్త కమిషనర్ దయాసాగర్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.