రగులుతున్న ‘ఎయిడెడ్‌’ రగడ

ABN , First Publish Date - 2021-10-28T08:33:32+05:30 IST

రగులుతున్న ‘ఎయిడెడ్‌’ రగడ

రగులుతున్న ‘ఎయిడెడ్‌’ రగడ

చీరాలలో 75 ఏళ్లనాటి ‘వీధి బడి’  మూసివేతపై తీవ్ర ఆందోళన

గుంటూరులో ఎస్‌ఎ్‌ఫఐ భారీ నిరసన

 అసత్య ప్రచారం: మంత్రి


చీరాలటౌన్‌/గుంటూరు(విద్య)/బద్వేల్‌, అక్టోబరు 27: ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఎయిడెడ్‌ పాఠశాల ‘వీధి బడి’ని మూసివేయడాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు బలవంతంగా టీసీలు ఇవ్వడాన్ని వారు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని దేవాంగపురి పంచాయతీలోని హస్తినాపురం జేహెచ్‌డీడీఎ్‌సఏపీ(వీఽధి బడి) ఎయిడెడ్‌ పాఠశాల 1947నుంచి నడుస్తోంది. పేద విద్యార్థులను అక్కున చేర్చుకుని విద్యనందిస్తున్న ఈ పాఠశాలను.. ప్రభుత్వం తీసుకున్న ‘ఎయిడెడ్‌ విలీనం’ నిర్ణయంతో మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1-5 తరగతులలో 81 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి పర్సంటేజీని జీరోగా చూపించాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు బలవంతంగా టీసీలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. 


ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని పరిరక్షించాలి: ఎస్‌ఎ్‌ఫఐ

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని పరిరక్షించాలని కోరుతూ గుంటూరులో ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి మనోజ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. జీవో 42ను రద్దుచేసి ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని పరిరక్షించాలని కోరారు. కాగా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ప్రతిపక్షం అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ బుధవారం కడప జిల్లా బద్వేలులో అన్నారు.  

Updated Date - 2021-10-28T08:33:32+05:30 IST