కొత్తగా 567 కేసులు.. 8 మరణాలు
ABN , First Publish Date - 2021-10-28T08:13:00+05:30 IST
కొత్తగా 567 కేసులు.. 8 మరణాలు

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 567 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో మరో 8 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,64,854కి, మరణాల సంఖ్య 14,364కి పెరిగింది. తాజాగా.. తూర్పుగోదావరిలో 161, చిత్తూరులో 94, కృష్ణాలో 84, పశ్చిమగోదావరిలో 46, గుంటూరులో 47 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 437 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 20,45,713కి చేరుకుంది.