కొబ్బరికాయల మాటున 2వేల కేజీల గంజాయి

ABN , First Publish Date - 2021-10-28T08:07:11+05:30 IST

కొబ్బరికాయల మాటున 2వేల కేజీల గంజాయి

కొబ్బరికాయల మాటున 2వేల కేజీల గంజాయి

రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

చింతూరు, అక్టోబరు 27: కొబ్బరి కాయల మాటున అక్రమంగా తరలిస్తున్న రూ.2కోట్ల విలువైన 2 వేల కిలోల గం జాయిని చింతూరు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌కు చెందిన పొగిడాల పర్వతా లు, ఒడిసాలోని మల్కనగిరి జిల్లాకు చెందిన నైని రామారా వు ఐషర్‌ వ్యానులో 2000 కిలోల గంజాయి వేసి ఆపైన కొబ్బరి కాయలు వేశారు. దీన్ని తెలంగాణ తరలించే క్రమంలో మోతుగూడెం పోలీసులకు చిక్కారు. నిందితులతోపాటు పైలెట్‌గా ఉంటూ పోలీసులు, చెక్‌పోస్టుల వివరాలు తెలిపిన కడియం గురుసాగర్‌ను కూడా అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-28T08:07:11+05:30 IST