30న రైతునేస్తం అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2021-10-25T09:05:12+05:30 IST

30న రైతునేస్తం అవార్డుల ప్రదానం

30న రైతునేస్తం అవార్డుల ప్రదానం


గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఈ నెల 30వ తేదీన 2021వ సంవత్సరానికి రైతునేస్తం అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ‘శ్రీముప్పవరపు ఫౌండేషన్‌’, ‘ రైతునేస్తం’  ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర వ్యవసాయమంత్రి కన్నబాబు పాల్గొంటారు. డాక్టర్‌ వెంకటేశ్వరరావు రైతునేస్తం అవార్డుల జాబితాను ఆదివారం గుంటూరులో విలేకరులకు వెల్లడించారు. జీవిత సాఫల్య పురస్కారం ఏఐకెఎస్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, కృషిరత్న అవార్డు ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్యకు చెందిన ఎర్నేని నాగేంద్రనాథ్‌కు ఇస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-10-25T09:05:12+05:30 IST